రిలయన్స్ గ్రూప్ కు చెందిన కాంపా బ్రాండ్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు
ఈ విషయాన్ని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. 2023 లో కాంపా బ్రాండ్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది రిలయన్స్. బ్రాండ్ విస్తరణ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. పెప్సీ, కోకాకోలా లకు పోటీగా ఈ కాంపా బ్రాండ్ ని తీసుకు వచ్చింది రిలయన్స్. ఈ సారి ఐపీల్ లో కాంపా ప్రకటనలే ఎక్కువగా కనపడుతున్నాయి. కాంపా బెవెరగె ధర కేవలం 10 రూపాయలు మాత్రమే
1970, 80 సంవత్సరాలలో ఈ కాంపా బ్రాండ్ బాగా పాపులర్ అయింది. అయితే 2022 లో ఈ కాంపా బ్రాండ్ ని రిలయన్స్ కొనుగోలు చేసిన 2023 మార్చ్ లో దీనిని మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు 2025 లో రామ్ చరణ్ భాగస్వామ్యంతో ఒక యాడ్ తయారు చేశారు. ఈ యాడ్ ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారమయ్యే అన్ని భాషలలో ప్రచారం చేయనున్నారు. క్రికెట్ కు మన దేశంలో ఉన్న ఆదరణ దృష్ట్యా ఈ ఐపీల్ ని ఉపయోగించుకుంటున్నారు. దీని ద్వారా ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళని, యువతని లక్ష్యం చేసుకున్నారు
Telugu
English

