కమ్‌బ్యాక్ కోసం రవితేజ సరికొత్త ప్లాన్.. ఈసారి పక్కా!

by | Feb 13, 2026 | సినిమా

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు చాలా కాలంగా ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాపులతో సతమతమవుతున్న Ravi Teja, ఫ్యాన్స్‌కు ఒక సూపర్ హిట్ ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే పారితోషికం విషయంలో రవితేజ సరికొత్త స్ట్రాటజీని అనుసరించనున్నారని టాక్‌. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో సినిమా బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాతలకు భారం తగ్గించే విధంగా రవితేజ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తన రెమ్యూనరేషన్ విషయంలో కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్లనున్నట్లు సమాచారం. సాధారణంగా రవితేజ ఒక్కో చిత్రానికి దాదాపుగా రూ. 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో సినిమా బడ్జెట్ రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకూ అవుతోంది. అయితే నిర్మాతలపై భారం పడకుండా ఉండేందుకు రవితేజ తన రెమ్యూనరేషన్‌ను తగ్గించుకుని, సినిమా లాభాల్లో వచ్చే వాటా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

దాంతో సినిమా బడ్జెట్ తగ్గడమే కాకుండా ఒకవేళ హిట్ అయితే వచ్చే లాభాల్లో రవితేజకు వాటా దక్కుతుంది. ఈ నిర్ణయం ద్వారా రవితేజ సినిమా నిర్మాణ వ్యయాన్ని తగించడమే కాకుండా, నిర్మాతలకు అండగా నిలువనున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికొస్తే.. రవితేజ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అంతగా కలక్షన్స్ ను సాధించలేకపోయింది. విజయాపజయాలను లెక్క చేయని రవితేజ వరుస సినిమాలను లైన్లో పెడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన దర్శకుడు శివ నిర్వాణ (Siva Nirvana) తో చేతులు కలిపారు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.