రవితేజ ‘ఇరుముడి’ సినిమా.. హీరోయిన్ ఫ‌స్ట్ లుక్ అదిరింది

by | Feb 15, 2026 | సినిమా

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) , క్లాసిక్ డైరెక్టర్ శివ నిర్వాణ (Siva Nirvana) కాంబినేషన్‌లో ‘ఇరుముడి'(Irumudi) అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్‌లో 77వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో ఆయన ఒక అయ్యప్ప భక్తుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ (Ravi Teja) ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ సినిమాలో సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) సంస్థ నిర్మించనుంది. గతంలో నిన్ను కోరి, మజిలీ, ఖుషి వంటి ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ ఈసారి ఓ ఫుల్ లెంగ్త్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇది ఒక పవర్‌ఫుల్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది. తన కూతురిని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి చేసే పోరాటం, చుట్టూ ఈ కథ నడవనుంది. అయితే తాజాగా ‘ఇరుముడి’ (Irumudi) సినిమాలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ న‌టిస్తున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ఫస్ట్ లుక్‌ (First Look) పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో ప్రియా భవానీ శంకర్ ‘కావేరి’ అనే పాత్రలో నటిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) సాంప్రదాయ గృహిణిగా ఉండ‌గా.. ర‌వితేజ ఆమెను ముద్దాడుతున్న‌ట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో కావేరి పాత్రలో నటించనున్న ప్రియా భవానీ శంకర్ రవితేజకు భార్య పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రానికి జీ.వీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటుగా విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.