ఈవెంట్ డాన్సులు, సాంగ్స్, స్పీచెస్ తో ప్రారంభమైంది.
గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చేలోపే కొన్ని స్పీచ్ లను ముగించేశారు
రామ్ చరణ్, నిర్మాత, దర్శకుల స్పీచ్ కూడా సింపుల్ గా ఉంది
ఈవెంట్ లో ప్రధానం శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ హైలైట్ అని చెప్పవచ్చు. పవన్ కల్యాణ్ గారి స్పీచ్ లో కొన్ని ముఖ్యాంశాలు
ఎంత ఎదిగిన మన మూలాలు మనం మర్చిపోకూడదు అని చెప్పారు.
ఈవెంట్ జరుగునంతసేపు పవన్ కల్యాణ్ గారు మోహంలో టెన్షన్ కనపడింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాల ప్రభావం కావచ్చు
ఏ ఒక వ్యక్తినో బాగా అభిమానించినా , అందరు అన్ని సినిమాలు చూస్తారు అని అన్నారు. ఇక్కడ మెగా అభిమానులు కాదు, సినీ అభిమానులు ఉన్నారు అని చెప్పారు
చిత్రం పరిశ్రమతో రాజకీయాలను ముడిపెట్టడం సరైంది కాదు అన్న దిల్ రాజు అభిప్రాయకం పవన్ కళ్యాణ్ గారు ఏకీభవించారు
చిత్ర పరిశ్రమ అభివృద్ధి కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు
దిల్ రాజు కు చురక అంటించారు. మీరు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అలా అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని చిన్న చూపు చూడకండి అని అన్నారు
భారత చలన చిత్ర రంగ అభివృద్ధికి ఎందరో నిర్మాతలు, దర్శకులు కృషి చేశారు. నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి సత్తా ఏంటి ప్రపంచానికి చాటి చెప్పారు. హైదరాబాద్ కు స్టూడియో రావడానికి అక్కినేని నాగేశ్వర రావు గారి కృషి మరవలేనిది అని చెప్పారు
నేను చేసిన, రామ్ చరణ్ గేమ్ చేంజర్ చేసిన ఆద్యులు మెగాస్టార్ చిరంజీవి గారే అని చెప్పారు. అన్నయ్య ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసనీ చెప్పారు
భారతీయ సినిమాలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శకులలో శంకర్ కూడా ఒకరు అని కొనియాడారు
నా తొలి ప్రేమ సినిమా కు దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్ అని, తర్వాత తనతో నిర్మాతగా వకీల్ సాబ్ తీశారు అని అన్నారు. డబ్బులు లేక కష్టాల్లో ఉన్నప్పుడు, వకీల్ సాబ్ ద్వారా వచ్చిన డబ్బులు జనసేన పార్టీ నడపడానికి ఇంధనం ల పని చేశాయని చెప్పారు
ఈ ఫంక్షన్ కి వచ్చిన మీరందరు క్షేమంగా ఇంటి వెళ్లాలని ఆకాక్షించారు. సినిమా వాళ్ళు వచ్చినప్పుడు, ఒకరినొకరు తోసుకోకండి, ఒకరి మీద ఒకరు పడకండి. మీకు దెబ్బ తగిలితే నా గుండెకు గాయమవుతుంది
చిరంజీవి గారిని చూస్తూ పెరిగాము. అయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. రామ్ చరణ్ కూడా అదే దారిలో వెళుతున్నాడు. సంవత్సరం లో 100 రోజులు రామ్ చరణ్ అయ్యప్ప స్వామి, ఆంజనేయస్వామి దీక్షలో ఉంటాడు. ఎందుకు అని అడిగితే ‘బాధ్యతో ఉండడానికి, అహంకారం, గర్వం రాకుండా ఉండడానికి అంటాడు రామ్ చరణ్ ‘అని చెప్పారు
రామ్ చరణ్ హార్స్ రైడింగ్ గురించి, రంగ స్థలం సినిమాల గురించి కూడా ప్రస్తావించారు టికెట్ రేట్ల పెంపుపై కూడా క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్ లు పెరిగిపోతున్నాయి అని, ఇప్పుడు సినిమా విశ్వ వ్యాప్తం అయ్యిందని అందుకే టికెట్ రేట్ల పెంపుకు, బెనిఫిట్ షో లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. అయితే దీని వాళ్ళ ప్రభుత్వానికి GST ద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు.
దిల్ రాజుకు ఆంధ్ర ప్రదేశ్ లో స్టూడియో నిర్మాణానికి, షూటింగ్ ల కు రావాలని పిలుపునిచ్చారు
రామ్ చరణ్ ఎంత ఎదిగిన ఒడి ఉండే బంగారం లాంటి వ్యక్తి అని కొనియాడారు
ఒక బాబాయ్ గా కాదు, అన్న గా ఆశీర్వదిస్తున్నాని చెప్పారు. తండ్రి మెగా స్టార్ అయితే, కొడుకు గ్లోబల్ స్టార్ కాక ఇంకేమవుతాడు అని అన్నారు

