మెగా ఫ్యాన్స్‌కి బిగ్ గుడ్ న్యూస్.. ‘ఆర్‌సీ16’ మూవీలో స్టార్ క్రికెటర్!

by | Mar 15, 2025 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్ డేట్ ఇండస్ట్రీలో లో హల్చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) తో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ థోని అతిథి పాత్రలో కనిపించబోతున్నాడ‌ని సమాచారం. ఇందులో రామ్ చరణ్ క్రికెటర్ పాత్రలో పోషిస్తుండగా థోని (Dhoni) రామ్ చరణ్ కు కోచ్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ధోని నిర్మాతగా మారి కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేయగా.. ఈ సినిమాతో నటుడిగా మారనున్నట్లు తెలుస్తోంది. దీనిలో నిజమెంతుందో తెలియదు కానీ ఒకవేళ ధోని కనుక ఈ సినిమాలో నటిస్తే పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. క‌న్న‌డ చ‌క్ర‌వ‌ర్తి శివరాజ్‌కుమార్, దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా, మార్చి 27న రామ్‌చరణ్‌ బర్త్ డే కానుకగా టైటిల్‌, టీజర్‌ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.