ఆర్సీబీ మాత్రమే కాదు, పంజాబ్, ఢిల్లీ, లక్నో లు కూడా

by | Mar 15, 2025 | ప్రగడ టీవీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (2025) 18 వ సీజన్  మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది.  ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అన్ని జట్లకు ఇండియన్ ప్లేయర్స్ నాయకత్వం వహిస్తున్నారు. ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే పాట్ కమ్మిన్స్ ను నమ్ముకుంది

ఇప్పటిదాకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవని జట్లు ఏవేవి ఉన్నాయో చూద్దాం

మొదటగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మీదే అందరి దృష్టి ఉంటుంది.  ఎందుకంటె కింగ్ కోహ్లీ ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు కాబట్టి.   17 సీజన్లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ ని గెలవలేకపోయింది

2009, 2011, 2016 – మూడు సార్లు ఐపీల్ ఫైనల్ కు వచ్చినప్పటికీ ఐపీల్ కప్ కల అందని ద్రాక్షగా మిగిలిపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు.  ఈ మూడు ఫైనల్స్ లో డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులలో ఓడిపోయింది

రెండవ జట్టు పంజాబ్ కింగ్స్.  ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్ కు అర్హత సాధించలేకపోయారు.  మొదటి సీజన్లో సెమి ఫైనల్ వరకు వచ్చారు

మూడవ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్.  ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీల్ ఫైనల్ కు చేరలేదు.  మొదటి రెండు సీజన్లలో సెమి ఫైనల్ లో ఓడి పోయింది

ఇక నాలుగవ జట్టు లక్నో సూపర్ జెయింట్స్.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2022 లో కొత్తగా అడుగు పెట్టిన జట్టు.  కేవలం మూడు సీజనలో ఆడింది.  అయితే మూడు సార్లు లీగ్ స్టేజి లోనే వెనుతిరిగింది. 

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ – ఈ మూడు జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన నాటి నుండి ఈ లీగ్ ఆడుతున్నాయి.

అయినా ఒక్కసారి కూడా ఐపీల్ ట్రోఫీ ని ముద్దాడలేదు. మరి ఈసారైనా  ఈ మూడు జట్లలో ఒకటి ఐపీల్ ట్రోఫీని గెలవాలని  ఆశిద్దాం