టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ తాజా చిత్రం ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దాంతో పాటుగా దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమాను చేయనున్నారు. అలాగే అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమాను చేయనున్నట్లు చిరు (Chiranjeevi) ప్రకటించారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో ‘ది పారడైజ్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే చిరంజీవితో సినిమా ఉంటుందని తెలుస్తోంది. అయితే ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ పూర్తవగానే చిరు, అనిల్ రావిపూడి సినిమా సెట్స్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రారంభించారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ మూవీలో మెగాస్టార్ కోసం అనిల్ రావిపూడి పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఈ క్రమంలో పాత స్టోరీనే ఇప్పటి నేటివిటీకి అనూకరించి తెరకెక్కిస్తే ఎలా ఉంటుందని అనిల్ రావిపూడి అనుకుంటున్నాడట. చిరంజీవి హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ తరహాలో ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా చేయాలని భావిన్నాడట. ఈ క్రమంలొనే కామెడీతో పాటుగా ఎమోషన్స్ మిక్స్ చేస్తూ అనిల్ రావిపూడి కథను సిద్ధం చేస్తూన్నాడట. మేలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన అదితి రావు హైదరీ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈమెతో పాటు ఐశ్వర్యా రాజేష్, శృతి హాసన్ పేర్లు కీడ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం చిరంజీవి 90 రోజులు డేట్స్ కేటాయించారట. ఈ క్రమంలోనే మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ సినిమాపై అధికారికి ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు సమాచారం

