మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. తాజాగా ‘ఆర్‌సీ16’ గ్లింప్స్ కు సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈనెల 27న రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా చరణ్ ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేేసందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఈ గ్లింప్స్‌కు సంబంధించిన కట్ పూర్తయిందట. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో గ్లింప్స్ ను ఎడిట్ రూమ్ లో కొందరు చూశారట. అయితే ఈ గ్లింప్స్ చూసినవాళ్లందరూ ఊహించని రేంజులో వచ్చిందంటూ ప్రశంసలు కురిపించారట. ఈ గ్లింప్స్ అదిరిపోయేలా ఉందని మెగా అబిమానులు కాలర్ ఎగరేయడం ఖాయమని అంటున్నారు. కాగా, ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారని సమాచారం. రామ్‌చరణ్ (Ram Charan) పుట్టిన రోజు నాడే గ్లింప్స్‌తో పాటుగా ఈ సినిమా టైటిల్ కూడా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇదే రోజున ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది కూడా మేకర్స్ ప్రకటించనున్నారట. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారు. కానీ చిత్రీకరణ ఇంకా చాలా వరకు పూర్తవకపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

