మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి నటనలో తండ్రికి ధీటుగా విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ బిరుదు అందుకున్నారు. ఇటీవలే రామ్ చరణ్ తన 40వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని ఆయన స్నేహితులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈసారి తన జన్మదిన వేడుకలకు రామ్ చరణ్ ఇంట్లోనే జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ బర్త్ డే పార్టీలో రామ్ చరణ్, ఉపాసన (Upasana) , చిరంజీవి దంపతులు, సుష్మితా కొణిదెల, హీరో నాగార్జునతో (Nagarjuna) పాటుగా రామ్ చరణ్ స్నేహితులు సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇక రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్సీ16’ మూవీ టైటిల్‌తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఆట కూలీగా కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో కథ రీత్యా రామ్‌చరణ్ అన్ని ఆటల్లో ఆరితేరి ఉంటాడట. అందుకే క్రికెట్, కుస్తీ, కబడ్డీ ఇలా ఆట ఏదైనా డబ్బులిస్తే ఆయా జట్ల తరపున బరిలోకి దిగుతాడాని తెలుస్తోంది.

https://twitter.com/upasanakonidela/status/1905899242201502001


