టాలీవుడ్ స్టార్ హీరో విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను చిత్ర బృందం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతోందని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ప్రకటించిన తేదీకి రావడం లేదని, అందుకు క్షమించాలని అభిమానులను కోరాడు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని మంచు విష్ణు వెల్లడించారు.
కాగా, కన్నప్ప సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. కాగా, ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడిగా హీరోయిన్ పాత్రలో ‘ఓం భీమ్ బుష్’ ఫేమ్ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతీ దేవిగా అలరించబోతున్నారు. అలానే మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, శివ బాలాజీ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర పాత్రను పోషించారు. కాగా, పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవస్సే, తెలుగు సంగీత దర్శకుడు మణిశర్మ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.
https://twitter.com/iVishnuManchu/status/1905935152989024270
Manchu Vishnu says ‘My Sincere Apologies!’


