‘కూలీ’ క్రేజీ అప్డేట్.. స్పెషల్ వీడియో చూశారా!

by | Mar 18, 2025 | సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్ త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ (Rajanikanth) తో పాటు నాగార్జున (Nagarjuna) , శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Ameer Khan) ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. బుట్ట బొమ్మ పూజా హెగ్దే స్పెష‌ల్ సాంగ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. రజనీకాంత్‌ కెరీర్‌లో ఇది 171వ చిత్రం కావడం విశేషం. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాల తర్వాత లోకేష్ కనగరాజ్‌ రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ’కూలీ’ మూవీ సెట్స్ నుంచి స్పెషల్ వీడియో విడుదల చేశారు. దీనికి ‘ఇట్స్ సూపర్ రాప్ ఫస్ కూలీ’ అని క్యాప్షన్ జత చేశారు. ’కూలీ’ మూవీ చిత్రీకరణకు సంబంధించిన సీన్స్​ను ఈ వీడియోలో చూపించారు. ఇందులో రజనీకాంత్​తోపాటు నాగార్జున కూడా కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలాఉంటే.. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు సమాచారం. కూలీ (Coolie) చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం బడా ఓటీటీ సంస్థలు పోటీపడినప్పటికి ఆఖరికి అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime) వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండగా.. ఇప్పటికే విడుదలైన కొన్ని మూవీ పోస్టర్లు, అలాగే టైటిల్ టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.