ఛాంపియన్స్ ట్రోఫీ లో ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఇంటి ముఖం పట్టింది పాకిస్థాన్. ప్రస్తుతం టి 20 సిరీస్ కోసం న్యూజిలాండ్ లో పర్యటిస్తోన్న పాకిస్థాన్ అక్కడ కూడా పేలవమైన ఆట తీరుని కనపరుస్తోంది.
వరుసగా రెండు టి 20 మ్యాచ్ లు గెలిచి సిరీస్ లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలోకి వెళ్ళింది
పాకిస్థాన్ ,న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టి 20 మ్యాచ్ లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకు జరిగిన మొదటి టి 20 మ్యాచ్ లో కూడా పాకిస్థాన్ ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే
వర్షం వలన 15 ఓవర్ల కు కుదించిన రెండవ టి 20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 9 వికెట్ ల నష్టానికి 135 పరుగులు చేసింది
28 బంతుల్లో 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ ఆఘా పాకిస్థాన్ ఇన్నింగ్స్ టాప్ స్కోరర్. షాదాబ్ ఖాన్ 14 బంతుల్లో 22 పరుగులు, షాహిన్ షా ఆఫ్రిది 14 బంతుల్లో 22 పరుగులు చేశారు
న్యూజిలాండ్ బౌలర్ల లో డఫి, సీర్స్, సోధి, నీషమ్ లు తలా రెండు వికెట్ లు తీసుకున్నారు.
ఆ తరవాత 136 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ కు చక్కని శుభారంభం లభించింది. ఓపెనర్ లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ లు మొదటి వికెట్ కు 66 పరుగులు జోడించారు
అలెన్ 38 పరుగులు, సీఫర్ట్ 45 పరుగులు చేసి అవుట్ అయ్యాక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కొంత తడబాటుకు గురయ్యింది.
చాప్ మన్ 1 పరుగు, నీషమ్ 5 పరుగులు, మిచెల్ 14 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అయిన తరుణంలో బ్రే స్ వెల్, మిచెల్ హే మరో వికెట్ పడకుండా న్యూజిలాండ్ ను గెలిపించారు. బ్రే స్ వెల్ 5 పరుగులు, మిచెల్ హే 21 పరుగులు చేసి అజేయంగా నిలిచారు
ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే లక్షయాన్ని చేధించారు. 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరులు చేశారు
పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా, అలీ, షా, ఖాన్ లు తలా ఒక వికెట్ తీశారు
22 బంతుల్లో 45 పరుగులు చేసిన టిమ్ సీఫర్ట్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకున్నాడు

