ఈ రోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజు నాడు కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురయ్యింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కొంత ఊరట
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారు 25 వేల మెజారిటీతో బి ఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై గెలిచారు. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ముందుండి ప్రచారం చేసి నడిపించాడు అనే కన్నా గెలిపించాడు అని చెప్పవచ్చు. ఉప ఎన్నిక ఫలితాన్ని రేవంత్ రెడ్డి పాలనకు, అభివృద్ధికి సంకేతం అని చెప్పలేము కానీ రేవంత్ రెడ్డి ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీ ని ముందుండి గెలిపించాడు అని చెప్పవచ్చు
ఉప ఎన్నికకు ముందు అజహరుద్దీన్ ను మైనారిటీ శాఖ మంత్రిని చేయడం. జూబ్లీ హిల్స్ సినీ కార్మికులకు పెంచిన టిక్కెట్ల నుండి వచ్చే ఆదాయం లో 20% సినీ కార్మికులకు అందేలా జి ఓ తీసుకు రావడం
సాధారణంగా ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ కి అనుకూలంగా ఉండడం
ఉప ఎన్నిక పై బి ఆర్ ఎస్ నేత కే సి ఆర్ మాటలాడక పోవడం, ఉప ఎన్నికకు ముందు మాగంటి గోపినాధ్ మరణించిన 5 నెలల తరవాత ఆయన తల్లి గోపినాధ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడం, మాగంటి సునీత పెళ్లి గురించిన వివాదాస్పద అంశాలు వంటి బి ఆర్ ఎస్ బలహీనతలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా మార్చుకోవడంలో విజయవంతం అయ్యారు
వరసగా మూడుసార్లు మాగంటి గోపినాధ్ ను గెలిపించిన ఓటర్లను గోపినాధ్ చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లు అడగడంలో బి’ఆర్ ఎస్ ఘోరంగా విఫలమయింది. అందుకే ఇక్కడ సానుభూతి కలిసిరాలేదు మాగంటి సునీతకు
మరో పక్క బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురయ్యింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మహాఘట్ బంధన్ కూటమి కి ఘోర పరాజయం ఎదురైంది. ఈ కూటమి కేవలం 34 సీట్లు గెలుచుకుంది (ఇప్పటివరకు 31 గెలుచుకుని 3 స్థానాలలో ఆధిక్యం)
ఈ కూటమిలో ప్రధాన పార్టీలు అయిన ఆర్ జే డి ఈ సారి కేవలం 26 స్థానాలకు పరిమితం అయింది. ఈ కూటమిలో మరో పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి ఘోరాతి ఘోరం. ఈ సారి కాంగ్రెస్ కేవలం 6 స్థానాలలో మాత్రమే గెలిచింది
కాంగ్రెస్, ఆర్ జే డి ల మధ్య సీట్ల షేరింగ్ లో గొడవలు, నాయకుల మధ్య సమన్వయ లోపం, తేజస్వి యాదవ్ నాయకత్వంలో లోపం, చేసిన హామీలలో స్పష్టత లేకపోవడం, ప్రధాని మోడీ జంగల్ రాజ్ భయాన్ని ఓటర్లలోకి బలంగా తీసుకువెళ్లడం వంటి అంశాలు మహాఘట్ బంధన్ ఘోర పరాజయానికి కారణాలు.
మరోవైపు బీజేపీ మహిళలపై దృష్టి సారించడం, మహిళలకు ప్రత్యేక సంక్షేమ పధకాలు, ప్రధాని 14 సభలతో 90 నియోజకవర్గాలలో ప్రచారం చేయడం వంటి అంశాలు బీజేపీ కి బాగా కలిసొచ్చినా అంశాలు
ఎలక్షన్ కమిషన్ ను నిందించిన రాహుల్ గాంధీ కి ఘోర పరాజయం. నెహ్రు పుట్టినరోజున కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలో గెలిపిస్తే, రాహుల్ గాంధీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలో మహాఘట్ బంధన్ కూటమికి ఘోర పరాజయాన్ని అందించాడు

