తమిళ నటుడు ధనుష్ హీరోగా నటించిన సినిమా ఇడ్లీ కడై. ఈ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు అన్ని తనయ్యాడు ధనుష్. ధనుష్ కు జతగా నిత్యా మీనన్ నటించింది.
ఈ చిత్రానికి చాలా మంది ఇచ్చిన రేటింగ్ లు కూడ అంత ఆశాజనకంగా లేవు. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ ఇడ్లి కడై (తెలుగు లో ఇడ్లి కొట్టు) సినిమా 71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించింది. ధనుష్ కెరీర్లో ప్లాప్ సినిమా గా మిగిలింది
అయితే గత నెల అక్టోబర్ 29 న ఈ ఇడ్లి కడై నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది. సుమారు 45 కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను కొనుక్కుంది.
ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన రెండు వారాల తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇడ్లి కడై నెంబర్ 2 కూడా ట్రెండింగ్ అయ్యింది. అంతే కాకుండా ఏడు దేశాలలో ఈ సినిమా టాప్ 10 లో నిలిచింది. తక్కువ సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమాను మించిపోయింది.
కొన్ని సినిమాలు థియేటర్ ఆడకపోయినా టీవీ లో రేటింగ్ లు బాగానే వచ్చేవి. ప్రస్తుతం థియేటర్ లో ప్లాప్ అయినా కొన్ని మంచి చిత్రాలకు ఓటిటి లో ఆదరణ బాగానే వస్తోంది. ధనుష్ క్రేజ్ తో పాటు ఎంచుకున్న కధ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు
ఇడ్లి కడై తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ బాషలలో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది.


