యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.
మాంక్స్ అండ్ మంకీస్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రచయిత సందీప్ బొల్లా, రాధాన్ స్వరాలూ సమకూర్చారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించింది నితిన్-భరత్ ల ద్వయం
ఈ సినిమాకు సంబందించిన ప్రొమోషన్స్ మొదలు పెట్టారు ప్రదీప్ మాచిరాజు. ప్రదీప్ మాచిరాజు, శేఖర్ మాస్టర్ కలిసి సుధీర్ దగ్గరికి వెళ్లిన ఒక ఫన్నీ ప్రొమోషనల్ వీడియో ని దర్శక ద్వయం నితిన్-భరత్ లు షేర్ చేశారు. ఈ సమ్మర్ లో సూపర్ కూల్ ఫన్ వీడియో ఇది. మీరు చూసేయండి
ఏప్రిల్ 11 న ప్రపంచ వ్యాప్తంగా ఈ అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది
గతంలో చిన్న చిన్న వేషాలు వేసిన ప్రదీప్ మాచిరాజు హీరో గా నటించిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది.

