‘స్పిరిట్’ మొదలయ్యేది అప్పుడే.. క్లారిటీ వచ్చేసింది!

by | Apr 13, 2025 | సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్పిరిట్‌ మూవీ ఈ ఏడాది చివర్లో అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పట్టాలెక్కుందని తెలుస్తోంది. ఈ మూవీ పూర్తి కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కనుండగా, ప్రభాస్‌ ఇందులో పోలీస్‌ పాత్రలో కనిపిస్తాడని అందుకోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసుకునేందుకు కొంత సమయం తీసుకున్నాడని తెలుస్తోంది.

పాన్ వరల్డ్ స్థాయిలో స్పిరిట్ (Spirit) మూవీ తెరకెక్కనుండగా ఈ సినిమా షూటింగ్ వివిధ దేశాల్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో పలువురు పేరున్న కొరియన్ నటులు, అమెరికన్ నటులు భాగం కానున్నట్లు సమాచారం. ఇక ఇటీవలే ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ షూటింగ్‌ను మెక్సికోలో జ‌రుప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్‌ ‘ది రాజాసాబ్’(The Raja Saab) , ‘ఫౌజీ’ (Fouji) సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరి వరకు ఈ రెండు సినిమా షూటింగ్‌లను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఆ తర్వాత ‘స్పిరిట్‌’పై ఫోకస్‌ పెట్టనున్నాడు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రానున్న ‘స్పిరిట్’ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించ‌నున్నారు. స్పిరిట్ మూవీకి హర్షవర్థన్‌ రామేశ్వర్‌ మ్యూజిక్ అందిస్తుండగా..ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, మాలీవుడ్ స్టార్ హీరో మమ్మూట్టి కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.