పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ హారర్ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న సినిమా ఇదే కావడంతో భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ది రాజా సాబ్ (Rajaa Saab) వేసవి కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కాని ఈ సినిమా మరోసారి వాయిదా పడేలా ఉంది. ఇటీవలే సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమా కోసం ఇచ్చిన మ్యూజిక్ పాతదైపోయిందని అందుకే కొత్తగా మళ్లీ ట్యూన్స్ కడుతున్నానని అన్నారు. దింతో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా పూర్తవకపోవడంతో ఏప్రిల్ 10న రావాల్సిన ఈ సినిమా మరి కొద్ది రోజులు వాయిదా పడేలా కనిపిస్తుంది. హార్రర్ కామెడీ జోనర్లో వస్తున్న రాజాసాబ్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ మేకర్స్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కోసం అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే టీజర్‌తో (Teaser) ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ రిలీజయింది. కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. దింతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీజర్‌ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 6న శ్రీరామనవమి కానుకగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. కాగా, హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు

