‘పెద్ది’ రిలీజ్‌కు ముందే సంచలనం.. మరో బిగ్ డీల్.!

by | Feb 11, 2026 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Cahran) కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi). బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు (Venakta Sathish Kilaru) నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పెద్ది నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ కూడా పెంచేశాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకోంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, ప్రమోషన్ కంటెంట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.

అయితే ‘పెద్ది’ (Peddi) సినిమా రిలీజ్‌కు ముందే ఓవర్సిస్ మార్కెట్‌లో అరుదైన ఘనత సాధించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘పెద్ది’ థియేట్రికల్ డీల్స్ దాదాపు ఖరారైనట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంకా మూవీ ప్రమోషన్స్ కూడా మొదలవకముందే డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘పెద్ది’ బ్రేక్​ ఈవెన్​ టార్గెట్​ నార్త్ అమెరికా మార్కెట్‌లో సుమారు 7 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. అలాగే రెస్ట్ ఆఫ్ వరల్డ్ మార్కెట్‌లో మరో 2.5 మిలియన్ డాలర్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఓవర్సీస్ లో పెద్ది మూవీ 9.5 మిలియన్ డాలర్లు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్కు(Ram Charan) విదేశాల్లో ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ లెక్కల్లో స్పష్టంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ ప్రీమియర్స్ టాక్ పాజిటివ్‌గా వస్తే, అక్కడ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక పెద్ది మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే, ఈ సినిమా ఆడియో రైట్స్ టీ సిరీస్ (T Series) సంస్థ రూ.25 కోట్లకు దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ న‌డుస్తుంది. అలాగే ‘పెద్ది’ (Peddi) సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దాదాపుగా రూ.130 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతుందో గానీ, ఈ నంబర్లు మాత్రం రామ్ చరణ్ రేంజ్‌ (Ram Charan) ఏంటో అని స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.