‘అల్లు అర్జున్ 42 రూల్స్.. స్పందించిన అల్లు అర్జున్ టీమ్’

by | Feb 11, 2026 | సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) తో షూటింగ్‌ చేయాలంటే కఠినమైన నిబంధనలు ఉన్నాయంటూ ఇటీవల ప్రముఖ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరీ బారువా (Kaveri Barua) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) తో యాడ్ షూట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన మేనేజర్స్ దాదాపు 42 నిబంధనలతో ఓ నోట్ ఇచ్చారని ఆమె పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. ‘అల్లు అర్జున్ కళ్లలోకి నేరుగా చూడకూడదు, షేక్‌హ్యాండ్ చేయకూడదు (No Handshake), అనుమతి లేకుండా మాట్లాడకూడదు, మధ్యలో కదలకూడదు, అల్లు అర్జున్ టీమ్ లో మేనేజర్లపైన మేనేజర్లు ఉంటూ సెక్యూరిటీని పర్యవేక్షిస్తారని, వాళ్లు చాలా కఠినంగా వ్యవహరిస్తారు, ఒక అగ్ర హీరోని కలవాలంటే ఇన్ని కఠిన నిబంధనలు ఉంటాయా అని ఆమె ఆ వీడియోలో తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.’

ఈ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు ఒక అగ్ర హీరోకి ఇంత సెక్యూరిటీ అవసరమా అంటుంటే, అభిమానులు మాత్రం బన్నీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై వస్తున్న ఈ కథనంపై ఆయన టీమ్ తాజాగా స్పందించింది. కావేరీ బారువా చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటించింది. ఇలాంటి ‍వార్తలను ఎవరూ కూడా నమ్మొద్దని అల్లు అర్జున్ టీమ్ కోరింది. అల్లు అర్జున్ సెట్స్ లో చాలా హుందాగా ప్రవర్తిస్తారని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయనపై ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో అయినా ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందా అన్నది చూడాలి. ఏదేమైనా ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

1