తెలుగు చిత్రసీమలో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా శ్రీలీల (Sree Leela), రాశి ఖన్నా (Rasi Khanna) కథానాయికలుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ అప్డేట్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరో క్రేజీ అప్ డేట్ అందించారు మేకర్స్.
ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు ఒక వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ‘మా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోటి వెంట థియేటర్లలో భీభత్సాన్ని సృష్టించబోతున్నాయి. త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇక పవన్ కళ్యాణ్ త్వరలో ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆ తేదీన రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘పెద్ది’ (Peddi) సినిమా రిలీజ్ కానుంది. కానీ ఈ మూవీ వాయిదా పడటంతో, అదే తేదీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) విడుదల కాబోతున్నట్లుగా సమాచారం. ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్ తర్వాత హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కాంబినేషన్ మరోసారి సినిమా రానుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాలో సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, వంశీ, అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

