‘హరిహరవీరమల్లు’ క్రేజీ పోస్టర్.. సెకండ్ సింగిల్ అప్​డేట్

by | Feb 14, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో నయా షెడ్యూల్​తో పుర్తయ్యేందుకు సిద్ధవుతోంది. అయితే తాజాగా హరిహరవీరమల్లు నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ‘హరి హర వీరమల్లు’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీలో రెండో సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ‘హరిహరవీరమల్లు’ చిత్ర యూనిట్ రెండో సాంగ్ పై సాలిడ్ అనౌన్స్మెంట్ చేశారు. ఫిబ్రవరి 14 ప్రేమికులరోజు కానుకగా పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ఇద్దరూ కలిసున్న ఎక్జయిటింగ్‌
పోస్టర్ తో క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఈ మూవీ లోని ‘కొల్లగొట్టిందిరో..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 28న తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.