నేషనల్ కాదు ఇంటర్నేషనల్..ఎన్టీఆర్‌-నీల్ మూవీపై నిర్మాత

by | Mar 3, 2025 | సినిమా

నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. ఎన్టీఆర్‌-నీల్ మూవీపై నిర్మాత షాకింగ్ కామెంట్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతేడాది దేవ‌ర మూవీతో ఎన్టీఆర్ భారీ హిట్ అందుకున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ మూవీ తరువాత క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) సినిమా చేస్తున్నాడు. #NTRNeel అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) , ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ (NTR Arts) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదిలాఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ను మైత్రీ మూవీ మూవీస్‌ ప్రొడ్యూసర్ రవి శంకర్‌ పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవిశంకర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్‌ ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలొనే రాలేదు. ఇందులో ప్రతీ కేరెక్టర్ కు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఊహకు అందని రీతిలో పక్కాగా నీల్ స్క్రిప్టును సిద్ధం చేశాడం.. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఈ మూవీను పాన్ ఇండియా రేంజ్ లో కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో రిలీజ్ చేయనున్నాం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుంది అనడానికి ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. ఏదేమైనా అనుకున్న సమాయానికి సినిమాను ఖచ్చితంగా విడుదల చేస్తాం
అని రవిశంకర్ చెప్పుకొచ్చారు.

ఇప్ప‌టికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్ లేకుండా కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తునట్లు తెలుస్తోంది. కాగా, మార్చి మూడో వారం నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. కాగా, పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్‌ పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.