బాక్సాఫీస్ వద్ద ‘డ్రాగన్’ సునామీ.. 10 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

by | Mar 3, 2025 | సినిమా

‘లవ్‌ టుడే’ మూవీ ఫేమ్ ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’. ‘ఓరి దేవుడా’ ఫేమ్ అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ హీరోయిన్లుగా నటించగా.. కల్పాతి ఎస్‌.అఘోరం, కల్పాతి ఎస్‌.గణేశ్‌, కల్పాతి ఎస్‌. సురేష్‌ నిర్మాతలుగా వ్యవహరించారు.. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

భారీ అంచనాల మధ్యత ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే విడుదలైన మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన పది రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, వీకెండ్ ముగినప్పటికీ ఈ మూవీ సోమవారం కూడా బాక్సఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. ఈ క్రమంలో ఈ వీకెండ్ నాటికి రూ. 200 కోట్ల మైలురాయిని చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు