కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పక్కా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ మూవీని మైత్రీ మూవీకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ ‘వార్ 2’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమాను చేస్తున్న ఎన్టీఆర్ తొలిసారిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమా తర్వాత, ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అయితే ఇప్పటికే భారీ హైప్, క్రేజ్‌ను ఏర్పర్చుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని.. ఫిబ్రవరి 17 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారట. వికారాబాద్ అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో మార్చి మొదటి వారంలో పాల్గొననున్నట్లు సమాచారం.
రవి బస్రూర్ సంగీతాన్ని అందించబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వాసంత్ హీరోయిన్గా నటించనుంది.

