సతీమణి ప్రణతి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రణతిలు జపాన్ వెకేషన్లో ఉన్నారు. కుటుంబ సమేతంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్.. తన భార్య పుట్టినరోజు వేడుకల్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రణతి బర్త్ డే కావడంతో మంగళవారం అర్ధరాత్రే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్యూట్ పోస్ట్ పెట్టారు తారక్. భార్య ప్రణతితో తీసుకున్న సెల్ఫీని షేర్ చేస్తూ ‘అమ్మలు.. హ్యాపీ బర్త్ డే’ అని ఎన్టీఆర్ (NTR) స్వీట్ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రణతిని ఇలా విష్ చేయడం అభిమానులకి తెగ నచ్చేసింది. అందుకే ఈ పోస్ట్ కు లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తారక్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతుంటాడు. ఇక ఫ్యామిలీ ఫోటోలను చాలా అరుదుగా పోస్ట్ చేసే తారక్ ఇటీవలి కాలంలో తన భార్య ప్రణతితో ఉన్న స్పెషల్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటున్నారు. కాగా 2011లో ఎన్టీఆర్- ప్రణతిల వివాహం జరగగా, వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ (NTR) నటించిన దేవర చిత్రం ఈ నెల 28న జపాన్ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రీమియర్స్ మొదలవ్వగా… వాటికి ఎన్టీఆర్ హాజరవుతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. దేవర మొదటి భాగం గతేడాది సెప్టెంబర్ 27న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే బాక్సఫీస్ వద్ద కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూ.. రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమా జపాన్‌లో విడుదల కానుంది. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ విడుదలైన బాద్షాతో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రాలు భారీ కలెక్షన్లు సాధించాయి. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా జపాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.


