మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ (Mad Square) సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’ (Rakasa) . మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ (Zee Studios) పతాకాలపై మెగాడాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మిస్తున్నారు. అంతకుముందు ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకుంది నిహారిక కొణిదెల. ఈసారి ‘రాకాస ’తో కూడా హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. నయన్‌సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారర్ కామెడీ బ్యాగ్డ్రాప్ లో రానున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడయ్యాయన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్‌కు రికార్డు స్థాయిలో ధర వచ్చిందన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. దాంతో నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్ లకు ఖండాంతరాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ‘రాకాస’ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. యూఎస్ఎ, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో 350కి పైగా థియేటర్లలో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, ఇటీవల విడుదలైన ‘రాకాస’ టీజర్ (Rakasa Teaser) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్, హారర్ బ్యాక్‌డ్రాప్ అన్నీ కలగలిపి హాస్యాభరితంగా టీజర్ ఉండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో తెలుసుకోవాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.


