అల్లు అర్జున్-అట్లీ.. ఏం బ్లాస్ట్‌ చేయబోతున్నారేంటి.?

by | Feb 16, 2026 | సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడుగా తమిళ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కేవలం దీపికా పదుకొణె మాత్రమే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రష్మిక మందన్న (Rashmika Mandanna) ఈసారి విలన్ లక్షణాలున్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) తో పాటుగా జిమ్ సర్భ్, కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అత్యంత భారీ వ్యయంతో సన్‌ పిక్చర్స్‌ (Sun Pictures) పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ‘AA22 x A6’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో, గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కామెడీ డ్రామా, ఎమోషన్స్‌ కూడా తగినంత ఉండేలా అట్లీ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం టాలీవుడ్ కామెడీ స్పెషలిస్ట్స్ గా పేరొందిన సీనియర్ డైరెక్టర్స్ శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి టీమ్స్‌కు చెందిన ఎనిమిది మంది రచయితలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వీరు రాసిన అదిరిపోయే కామెడీ సీక్వెన్స్ లను అల్లు అర్జున్ (Allu Arjun) , యోగి బాబులపై షూట్ చేసినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, అభిమానులకు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం ‘AA22 x A6’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఒక పవర్‌ఫుల్ టైటిల్‌ను ఇప్పటికే చిత్రబృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో పాటు స్పెషల్ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. రిలీజ్‌పై మేకర్స్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.