టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా చేస్తున్న నాని ఆ తర్వాత ఓజీ డైరెక్టర్ సుజిత్ (Sujith) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈరోజు నాని పుట్టినరోజు సందర్భంగా ఈసినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నాని కెరీర్ లో 32వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అనౌన్స్‌మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశారు. గతంలోనే ఈ సినిమాను ప్రకటించగా, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, తాజాగా దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను నాని బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా సుజీత్ మొదటి చిత్రం ‘రన్ రాజా రన్’ తరహాలోనే, కామెడీ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్ లతో ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో నాని చెఫ్ పాత్రతో పాటుగా గ్యాంగ్‌స్టర్‌గా కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నానికి జోడిగా హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి (Tripti Dimri) ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ (Niharika Entertainments), యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలాఉంటే.. నాని కథానాయకుడిగా రాబోతున్న మరో చిత్రం ‘ది ప్యారడైజ్’.(The Paradise) టాలెంటెడ్ డైరెక్టర్ ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్ చెరుకూరి భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ క్రమంలొనే శ్రీకాంత్ ఓదెలా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా సెట్స్‌లో నానితో తనకున్న అనుబంధాన్ని శ్రీకాంత్ తాజాగా పంచుకున్నాడు. నాని అన్నా, నువ్వు ప్రతిసారి ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అన్నప్పుడల్లా నాకు అది ‘నేను నిన్ను నమ్ముతున్నాను శ్రీకాంత్’ అన్నట్లుగా వినిపిస్తుంది. ఆ నమ్మకమే నన్ను ప్రతి సెకను భయపెడుతుంటుంది. అందుకే ‘ది ప్యారడైజ్’ కోసం నా రక్తాన్ని, ఆత్మను ధారపోస్తున్నాను. నన్ను నమ్మి నా ‘ధరణి’ (దసరా మూవీ) కి, మళ్ళీ నమ్ముతున్న నా ‘జడల్’ (Jadal) కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ రుణం జీవితాంతం తీర్చుకోలేనంటూ శ్రీకాంత్ ఓదెలా రాసుకోచ్చాడు. ఇక నాని పుట్టినరోజు సందర్భంగా ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ‘ఆయా షేర్’ అనే టైటిల్‌తో రానున్న ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.


