నేచురల్ స్టార్ నాని సమర్పణలో రూపొందిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో ముస్తాబైన ఈ సినిమా హొలీ కానుకగా మార్చి 14న విడుదలవగా బాక్సఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. యూఎస్ లో ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ కూడా వేసుకోగా.. వాటికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. బుక్ మై షోలో ఈ మూవీకి గంటకి 8 వేలకి పైగా టికెట్స్ అమ్ముడవుతుండడం విశేషం.
దింతో తొలి రోజే సాలిడ్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి లభించింది. యూఎస్ మార్కెట్ లో ఈ సినిమాకి కేవలం ప్రీమియర్స్ తోనే లక్ష 50 వేల డాలర్స్ కి పైగా గ్రాస్ ని రాబట్టడం విశేషం. దీనితో యూఎస్ మార్కెట్ లో కోర్ట్ మూవీకి ఎలాంటి హైప్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలానే ఈ వీకెండ్ ముగిసే నాటికి కోర్ట్ కు అదిరిపోయే కలెక్షన్స్ దక్కే అవకాశముంది. ఇక నాని నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘కోర్ట్’ నచ్చకపోతే తన రాబోయే సినిమా ‘హిట్ 3’ చూడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే నాని నమ్మకాన్ని నిజం చేస్తూ కోర్ట్ మూవీ బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

