నాని – వెంకీ అట్లూరి క్రేజీ కాంబో ఆన్ ది వే.!

by | Feb 12, 2026 | సినిమా

తెలుగు చిత్రసీమలో ఈ ఏడాది హీరో నాని (Nani) లైనప్‌ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన పీరియాడిక్‌ మూవీ ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా అనంతరం ఆయన సుజిత్‌ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) సెట్స్‌లో జాయిన్‌ కాబోతున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు తాజాగా నాని మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. దీనికి వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహిస్తారని తెలిసింది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న‌ దర్శకుడు వెంకీ అట్లూరితో నాని సినిమా చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) పతాకంపై సూర్యదేవర నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

‘జెర్సీ’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సితార కాంబినేషన్‌లో నాని చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇక వెంకీ అట్లూరి ప్రస్తుతం కోలీవుడ్ అగ్ర హీరో సూర్య (Surya) కథానాయకుడిగా ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ (Vishwanadhan & Sons) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఈ ఏడాది చివర్లో నాని (Nani), వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబో పట్టాలెక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక నాని అంటే మాస్ అప్పీల్‌, ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌, యాక్షన్‌, కామెడీ, రొమాన్స్..ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఉంటాయని తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరితో నాని సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్లారిటీ రానుందని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.