నటసింహం నందమూరి బాలకృష్ణ (Bala Krishna) ప్రస్తుతం తన కెరీర్ లో 111వ సినిమాతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ‘ఎన్‌బీకే 111’ (NBK111) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఎస్.తమన్ మ్యూజిక్ అందించగా.. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలేర్పడ్డాయి. అయితే ఈ సినిమా పట్టాలపై ఉండగానే బాలయ్య మరికొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టారని వినిపిస్తోంది. గోపీచంద్ మలినేనితో చేస్తున్న మూవీ తరువాత హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్ మీద నాగవంశీ (Naga Vamsi) నిర్మించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
అలాగే ఈ సినిమా తర్వాత యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలోనూ బాలకృష్ణ ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయట. ఈ ఏడాది చివర్లోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. త్వరలోనే ఫైనల్ కాస్టింగ్ ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని బాలయ్యతో ఇంతకు ముందు ‘వీరసింహారెడ్డి’ నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తోంది. ఇప్పటి దాకా అగ్ర హీరోలతో సినిమాలు చేయని వివేక్ ఆత్రేయ బాలకృష్ణను ఎలా చూపించనున్నారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వివేక్ ఆత్రేయ కూడా ఈ కథను పూర్తిగా విభిన్నంగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌పై అభిమానులే కాదు, ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, వివేక్ ఆత్రేయ మరోవైపు ఇటీవలే మాస్ మహా రాజా రవితేజకు కూడా ఓ కథ వినిపించాడని.. పలు కారణాల వల్ల ఈ కాంబో సెట్ కాకపోవడంతోనే బాలకృష్ణను లైన్‌లోకి తీసుకొచ్చాడని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సరిపోదా శనివారం తర్వాత వివేక్ ఆత్రేయ చేయబోయే కొత్త సినిమాపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి మరి.

