టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) కథానాయకుడిగా రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్ (The Paradise) ‘. టాలెంటెడ్ డైరెక్టర్ ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కయాదు లోహర్ కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్ చెరుకూరి భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నాని ‘జడల్’ (Jadal) అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అందుకే ఇక ఆలస్యం చేయకుండా ప్రమోషన్లను స్టార్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను నాని పుట్టినరోజు సందర్భంగా తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఆయా షేర్’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోతోనే ఆదరగొట్టింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ కూడా అలానే దుమ్మురేపుతోంది. ముఖ్యంగా ఇందులో నాని ఎనర్జీ అదిరిపోయింది. నాని స్టైల్ ఆఫ్ మ్యానరిజంతో సాగుతూ అభిమానులు ఆశించే ఎలిమెంట్స్‌తో ఉండబోతుందని ఇందులోని విజువల్స్ చెబుతున్నాయి. ‘ఆయా షేర్’ అంటూ నాని వేసే స్టైలిష్ స్టెప్పులు స్టేజ్ షేక్ అవడం గ్యారంటీ అని సాంగ్ చెబుతోంది. ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ కంపోజిషన్‌లోని టీం అదిరిపోయే బీట్ అందించారు. ఇక తమ అభిమాన హీరో మ్యానరిజాన్ని చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూనే.. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

