నేచురల్ స్టార్ నాని (Nani) , ఓజీ డైరెక్టర్ సుజిత్ (Sujith) కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే చిత్రంలో నటిస్తుండగా, సుజీత్ (Sujith) మాత్రం తన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఓజీ’ (OG) ఇచ్చిన విజయోత్సాహంలో ఉన్నాడు. ఈ క్రమంలో నాని , సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇక ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ మూవీలో నానికి జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) మెరువబోతున్నారని ఓ క్రేజీ గాసిప్ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇప్పటికే పూజా హెగ్డేతో స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని నెట్టింట చర్చ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే నాని-పూజా హెగ్డే (Nani and Pooja Hegde) జోడీ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనుందన్నమాట.
కాగా, నాని- సుజిత్ సినిమా గతేడాది పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. నానితో చేయనున్న ఈ సినిమా ఓజీని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట సుజిత్. నానిని ఇదివరకెన్నడూ చూడని విధంగా పూర్తి కొత్త లుక్ లో చూపించాలాని సుజిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే .. ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ రైట్స్ విషయంలో ఒక భారీ డీల్ కుదిరినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నిజానికి నాని చిత్రాలకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ నుండి ఎక్కువ లాభాలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా కోసం భారీ ధరను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) మూవీ ఓటీటీ రైట్స్ కంటే కూడా ఎక్కువ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

