మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) , స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇదే జోష్ లో ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీ (Bobby) తో చేయనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత చిరు, బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమా త్వరలోనే పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మించనుంది. భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కే వి ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఇతర సినిమాల పనులతో పాటుగా కొన్ని ఇతర సమస్యలతోనూ సతమతమవుతున్నట్లుగా తెలుస్తోంది. మెగా158 సినిమా భారీ స్థాయి ప్రాజెక్ట్ కావడంతో పక్కా ప్రణాళికలతో నిర్మాతలు ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకు సమయం పట్టేలానే కనిపిస్తోంది. అలాగే ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యాన్ని విస్తరించే విధంగా మరో నిర్మాణ సంస్థను సహ నిర్మాతలుగా తీసుకునే అవకాశాన్ని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో స్క్రిప్ట్ డిజైనింగ్, టెక్నీషియన్స్ ఎంపిక, లోకేషన్స్ వంటి అంశాలపై మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

