నాగ చైతన్యతో ‘తెనాలి రామకృష్ణ’ ప్రకటించిన దర్శకుడు

by | Feb 11, 2025 | సినిమా

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.  నాగ చైతన్య, సాయి పల్లవి లో నటన, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాని విజయవంతం చేశాయి.  నాగార్జున ముఖ్య అతిధిగా తండేల్ సక్సెస్ ఈవెంట్ జరుగుతోంది. 

ఈ ఈవెంట్ లో తండేల్ చిత్ర దర్శకుడు చందూ మొండేటి నాగ చైతన్యతో హిస్టారికల్ సినిమా ‘తెనాలి రామ కృష్ణ’ సినిమాని ప్రకటించాడు.  ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు దర్శకుడు చందూ మొండేటి.  అక్కినేని నాగేశ్వరరావు గారి అభినయం మళ్ళీ నాగ చైతన్యలో చూస్తారు అని అన్నారు