ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై, ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 120 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. కీలక ఆటగాళ్లు మూని ఒక పరుగు చేసి అవుట్ అవ్వగా, గార్డనర్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యింది. 32 పరుగులు చేసిన హర్లీన్ డియోల్ గుజరాత్ జెయింట్స్ లో టాప్ స్కోరర్.
ముంబై ఇండియన్స్ బౌలర్ల లో హీలి మాధ్యుస్ మూడు వికెట్లు తీయగా, నాట్ సీవర్ Brunt, అమేలియా కెర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇస్మాయిల్, అమన్ జోత్ కౌర్ చెరో వికెట్ తీశారు
అనంతరం 121 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ను నాట్ సీవర్ Brunt ఆదుకోవడంతో 16.1 ఓవర్ లలో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదించింది
హీలి మాధ్యుస్ 17 పరుగులు, యాస్తికా భాటియా 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ 4 పరుగులు చేసి గౌతమ్ కాశ్వీ బౌలింగ్ లో ఎల్ బి డబ్ల్యూ అయ్యింది
నాట్ సీవర్ Brunt, అమేలియా కెర్ లు నాలుగవ వికెట్ కు 45 పరుగులు జోడించి ఆదుకున్నారు. కెర్ 19 పరుగులు చేసి అవుట్ అవగా, Brunt 39 బంతుల్లో 57 పరుగులు చేసి అవుట్ అయ్యింది
విజయానికి 7 పరుగులు కావాల్సిన తరుణంలో నాట్ సీవర్ Brunt అవుట్ అయ్యింది. ఆ తరవాత వచ్చిన కమలిని, సజన లాంఛనాన్ని పూర్తి చేశారు
గుజరాత్ జెయింట్స్ బౌలర్ల లో కాశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా చెరో వికెట్లు తీయగా, తనూజ కన్వర్ ఒక వికెట్ తీసింది
కీలక మైన మూని, గార్డనర్ వికెట్ లు తీయడమే కాకుండా 57 పరుగులు చేసి మ్యాచ్ టాప్ స్కోరర్ గా నిలిచిన నాట్ సీవర్ Brunt ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది.
.

