అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ ఫోటోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి (Chiranjeevi) ఇలా ట్వీట్ చేశారు ‘ “నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.”అని క్యాప్షన్ జోడించారు. మెగాస్టార్ (Mega Star) షేర్ చేసిన ఫొటోలో ఆయన సతీమణి సురేఖతో పాటు చిరుతో కలిసి నటించిన రాధిక, టబు, నదియా, జయసుధ, మీనా, సుహాసిని, కుష్బూ ఉన్నారు.
ఇక ఉమెన్స్ డే సందర్భంగా మెగా స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజైన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి తల్లి అంజనమ్మ తన పిల్లలు చిరంజీవి, నాగబాబు(Naga Babu) , విజయ దుర్గలతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా, ఈ ఇంటర్వ్యూ పూర్తి ఎపిసోడ్ ఈరోజు విడుదల అయింది. అయితే ఈ ఇంటర్వ్యూలో అందరూ తమ తల్లి అంజనమ్మతో (Anjanamma) చిన్నప్పుడు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అలాగే వారి జీవితంలో తమ తల్లి ఎంతలా సపోర్ట్ చేశారో వివరించారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత అనిల్ రావిపూడితో పాటు శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు చేయబోతున్నారు.

