విశ్వక్ సేన్ హీరో గా వస్తోన్న చిత్రం ‘లైలా’. ఈ చిత్ర ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెట్ అప్ లో అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్ పతాకం పై, సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం జరగబోతోంది. ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి గారు, బాస్ అఫ్ కామెడీ, అనిల్ రావిపూడి గారు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు.
ఇదే వేదిక పై, సాహు గారపాటి, అనిల్ రావిపూడి, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ సినిమా గురించి ప్రకటించే అవకాశం ఉంది
ఈ ఈవెంట్ కు సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్ లో విశ్వక్ సేన్ ని, మాస్ కా దాస్ అని, మెగా స్టార్ చిరంజీవి ని, బాస్ ఆఫ్ మాసెస్ అని వేశారు. మెగా స్టార్ అభిమానులు ఇది చూసి మురిసిపోతున్నారు


