సందీప్ – మహేశ్‌ కాంబో.. స్పెషల్ సర్​ప్రైజ్​కు అంతా రెడీ!

by | Feb 20, 2026 | సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) . కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ యేడాది డిసెంబర్ లోగా ‘వారణాసి’ (Varanasi) షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగానే, మహేశ్ బాబు (Mahesh Babu) తో సినిమా చేసేందుకు అగ్ర నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఇప్పటికే తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రేసులో ఉండగా.. ‘కేజీఎఫ్’, ‘సలార్’ లాంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ తో పాటు సన్ పిక్చర్స్ కూడా మహేశ్ బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఏషియన్ ఫిల్మ్స్ బ్యానర్ మరో అడుగు ముందుకేసి సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో మహేశ్ బాబు సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు మహేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గతంలోనే మహేశ్ బాబు కోసం ‘డెవిల్’ (Devil) అనే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని అది ‘వారణాసి’ మూవీ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగా – మహేశ్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించిన ప్రకటన మహేశ్ బర్త్ డే అయిన ఆగస్టు 9న రానుందనే టాక్ వినిపిస్తోంది. ఇక మహేశ్ బాబుతో సందీప్ రెడ్డి వంగా తీయబోయే సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మహేశ్ బాబు (Mahesh Babu) ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే సందీప్ రెడ్డి తనదైన స్టైల్ లో సినిమా తెరకెక్కిస్తారని అభిమానులు భావిస్తున్నారు.