మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు మన మార్కెటింగ్ గురు రాజమౌళి.
దీనిలో భాగంగా ఈ సినిమా నుండి ప్రతినాయకుడి పాత్ర కుంభ ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. మలయాళ నటుడు, పృథ్విరాజ్ సుకుమారన్ ఈ కుంభ పాత్రని పోషిస్తున్నారు.
ప్రస్తుతం గ్లోబల్ ట్రాటర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కధానాయిక. కె ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఒక పక్క ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, మరో పక్క ఈ సినిమా కు సంబందించిన గ్రాండ్ ఈవెంట్ ను రామోజీ ఫిలిం సిటీ లో వచ్చే శనివారం అంటే ఈ నెల 15 న ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఈ వారం అంతా ఈ సినిమాకు సంబందించిన విశేషాలను పంచుకుంటానని రాజమౌళి చెప్పారు
ఇందులో భాగంగా మొదట ప్రతినాయకుడి పాత్ర ‘కుంభ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మహేష్ బాబు లుక్ ను, చిత్ర టైటిల్ ను వచ్చే వారం జరిగే ఈవెంట్ లో విడుదల చేసే అవకాశాలున్నాయి
ఈ SSMB29 ఈవెంట్ ను జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఈ సినిమాను 2027 లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలపైనా ఈ కూడా ఈ ఈవెంట్ లో ప్రకటన చేసే అవకాశం ఉంది.

