‘మహావతార్ నరసింహ’ ….బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ఉగ్ర రూపం

by | Aug 10, 2025 | సినిమా

Kleem ప్రొడక్షన్ వారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ.  ఈ చిత్రానికి  హోంబేలె ఫిలిమ్స్ (Hombale Films) వారు ప్రెజెంటర్ గా వ్యవహరించారు.  సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.  అశ్విన్ కుమార్ ఈ యానిమేషన్ చిత్రానికి దర్శకుడు

మహావతార్  సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి చిత్రం ఈ మహావతార్ నరసింహ (Mahavatar Narasimha).  జులై 25 న, ప్రపంచ వ్యాప్తంగా,విడుదలైన ఈ మహావతార్ నరసింహ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. 

ముఖ్యంగా ఈ చిత్రం హిందీ లో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కొంత మంది చెప్పులు బయట విడిచి థియేటర్ల లోకి వెళుతున్నారని తెలుస్తోంది.  తెలుగు లో ఈ సినిమాని అల్లు అరవింద్ (Allu Aravind) విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ మహావతార్ నరసింహ సినిమా సుమారు 18 కోట్లు దాకా వసూలు చేసినట్లు సమాచారం.  ఈ చిత్రం 175 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు

పెద్ద స్టార్స్ లేకపోయినా, ఒక యానిమేటెడ్ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడం చరిత్రలో ఇదే మొదటి సారి.  ముఖ్యంగా ఈ చిత్రంలో  గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 

ఎప్పుడో 1967 లో విడుదలైన భక్త ప్రహ్లాద తరవాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు నరసింహ స్వామి మీద సినిమా వచ్చింది.  ఈ సినిమాను యానిమేషన్ రూపం లో  తీసుకురావాలన్న ఆలోచన ఈ తరం ప్రేక్షకులను  కూడా ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narasimha)  సినిమా చూడడానికి థియేటర్ల కు రప్పించేలా చేసింది.

ఇంత మంచి సినిమా అందించిన ప్రొడక్షన్ వారికి, హోంబేలె ఫిలిమ్స్ వారికి, దర్శకుడు అశ్విన్ కుమార్ (Ashwin Kumar) కి, సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ (Sam CS) లకు ప్రగడ టీవీ అభినందనలతో పాటు ధన్యవాదాలు తెలియచేస్తోంది.