పిఠాపురం అభివృద్ధిపై మాట్లాడనున్న పవన్ కళ్యాణ్

by | Mar 10, 2025 | రాజకీయాలు

జనసేన పార్టీ ఆవిర్భావ సభ పై నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.  మార్చ్ 14 న జనసేన 12 వ ఆవిర్భావ దినోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని జనసేన పి ఎ సి చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు

ఈ ఆవిర్భావ సభకు శాసన సభ్యులు , పార్లమెంట్ సభ్యులు, నియోజక వర్గ ఇంచార్జి లు, జిల్లా అధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు అందరు కలిసికట్టుగా ఈ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు

సభ 4 గంటలకు ప్రారంభమై, మన సంస్కృతిని పెంపొందించే దిశగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంతే కాకుండా  మా నాయకుడి సలహా మేరకు యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాము.   రాష్ట్రం నలుమూలలనుండి కొంత మందిని ఎంపిక చేసి మహిళా సమస్యలపై, వ్యవసాయం గురించి రైతులు పడుతున్న కష్టాల గురించి, క్షేత్ర స్థాయిలో యువత ఏం ఆశిస్తున్నారో, రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు అనే విషయాలపై తెలుసుకోవడానికి ఈ ఆవిర్భావ సభ ఒక వేదిక కావాలని యువతను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం

అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ని గెలిపించినందుకు కృతజ్ఞతగా పిఠాపురం లో ఈ సభ నిర్వహిస్తున్నామని నాదెండ్ల మనోహర్ గారు అన్నారు.  అంతే కాకుండా పిఠాపురం అభివృద్ధికి చేసిన కార్యక్రమాల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు అని చెప్పారు.

  • ఆ సభ ప్రాంగణంలో తోపుడు బండ్ల వాళ్లకు వ్యాపార అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ సూచన చేశారు. ఎండ వేడి తట్టుకోవడానికి మంచినీళ్లు, మజ్జిగ, పుచ్చకాయాలు, ORS ప్యాకెట్లు అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం
  • అలాగే సభ ప్రాంగణంలో గాని, చుట్టు పక్కల గాని, రహదారులలో గాని పర్యావరణానికి హాని కలిగించకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు
  • ఆవిర్భావ సభ అయిన తరవాత అందరు క్షేమంగా ఇంటికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
  • తిరుగు ప్రయాణంలో అందరికి నాలుగు ప్రధాన రహదారుల్లో భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నాం

రేపు సాయంత్రం కల్లా ఈ కార్యక్రమం వివరాలు మీకు అందచేస్తాం. జనసేన పార్టీ నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో అన్న విషయం మీకు తెలియాలి.  సుమారు 5 గంటలపాటు ఈ సభ జరుగుతుంది.  అనేక మంది నాయకులు అనేక అంశాలపైనా మాట్లాడతారు.

https://youtu.be/I9GM0rUvdOg