మార్చ్ 14 న జన సేన ఆవిర్భావ వేడుకలు

by | Feb 17, 2025 | వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చ్ 14 న నిర్వహిస్తామని ఒక ప్రకటనలో జనసేన పార్టీ తెలిపింది. అంతే కాకుండా ఈ ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో చేపట్టాలని జన సేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారని తెలిసింది.

గత ఎన్నికలలో పిఠాపురం నుండి  శ్రీ పవన్ కళ్యాణ్ ఎమ్ఎల్ఏ గా  ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఎమ్ఎల్ఏ గా  విజయం సాధించిన తరవాత పిఠాపురం ను అభివృద్ధి పధంలో పరిగెత్తిస్తున్నారు జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు

ఈ ఆవిర్భావ వేడుకలకు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలలో 100% స్ట్రైక్ రేట్ ఘానా విజయం సాధించిన తరవాత నిర్వహిస్తున్న అతి పెద్ద భారీ బహిరంగ సభ ఇదే.

ఈ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారు అని అందరు ఇప్పటినుండే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.