ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో, ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 8 వికెట్ల తేడాతో తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ 142 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో చేధించింది
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.3 ఓవర్లలో 141 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
గత మ్యాచ్ లో అదరగొట్టిన షెఫాలీ వర్మ ఈ మ్యాచ్ మొదటి బంతికే డక్ అవుట్ అయ్యింది. 34 పరుగులు చేసిన జెమిమా రోడ్రిగ్స్ ఢిల్లీ కాపిటల్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్
షెఫాలీ వర్మ అవుట్ అయ్యాక, రెండవ వికెట్ కు జెమిమా రోడ్రిగ్స్ ,మెగ్ లానింగ్ 59 పరుగులు జోడించారు. అయితే జెమిమా అవుట్ అయ్యాక, ఢిల్లీ క్యాపిటల్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ల లో, పేసర్ రేణుక సింగ్, వారెహామ్ మూడేసి వికెట్లు తీయగా, బిస్త్, గర్త్ రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం 142 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్ లు స్మ్రితి మందన, హాడ్జ్ లు మొదటి వికెట్ కు 107 పరుగులు జోడించారు. ఓపెనర్ హాడ్జ్ 33 బంతుల్లో 42 పరుగులు చేసి అరుంధతి రెడ్డి బౌలింగ్ లో అవుట్ అయ్యింది
మరో ఓపెనర్, కెప్టెన్ స్మృతి మందన కేవలం 47 బంతుల్లో 81 పరుగులు చేసి శిఖా పాండే బౌలింగ్ లో అవుట్ అయ్యింది. స్మృతి మందన ఇన్నింగ్స్ లో 3 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి.
అయితే ఆ తరవాత వచ్చిన పెర్రీ (5 నాట్ అవుట్) , రిచా ఘోష్ (11 నాట్ అవుట్) మరో వికెట్ పడకుండా లాంఛనాన్నిపూర్తి చేశారు.
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టును ఒంటి చేత్తో గెలిపించిన స్మృతి మందన ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది

