జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. జనసేన పార్టీ కి గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపింది. పార్టీ ని రిజిస్టర్ చేసారు ఇప్పటివరకు. అయితే ఇప్పటినుండి, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీ గా అవతరించడంతో, గాజు గ్లాస్ గుర్తును వేరే ఎవరికి కేటాయించరు
జనసేన పార్టీ ఆవిర్భవించి 10 ఏళ్లకు పైగా అయినా ఈ సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు రావడం శుభ సూచకం. 2014 లో ప్రారంభమైన జనసేన ఆ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ ప్రభుత్వానికి బయటనుండి మద్దతు తెలిపింది. ఆ తరవాత 2019 ఎన్నికల్లో పోటి చేసిన కేవలం ఒక్క సీటుతో సరి పెట్టుకుంది. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల ఒడి పోయాడు. గెలిచినా ఆ ఒక్క సీట్ వైస్ జగన్ పార్టీలోకి జంప్ అయ్యాడు. అయినా పట్టుదలతో శ్రమించి 2024 లో పోటీ చేసిన ప్రతి చోట తన అభ్యర్థులను గెలిపించుకున్నాడు
2024 ఎన్నికల్లో, 21 యం ఎల్ ఏ, 2 ఎంపీ సీట్లు గులుచుంకుంది జనసేన. 100% స్ట్రైక్ రేట్ సాధించిన తోలి పార్టీ గా అవతరించింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా ఉన్న పవన్ కల్యాణ్ తదుపరి కర్తవ్యం, జనసేన క్యాడర్ ను బలోపేతం చేయడం, సొంతంగా పార్టీ ని అధికారంలోకి తీసుకు రావడం
అయితే పవన్ కల్యాణ్ కు సినిమాల కన్నా, అధికారం కన్నా ప్రజాసేవే ఆయనకు పరమావధి అని మనందరికీ తెలిసిందే

