‘జైలర్‌-2’: బాల‌య్య, సూర్యతో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌!

by | Apr 3, 2025 | సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్‌’ చిత్రం బాక్సఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సన్‌పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. రజినీకాంత్ ప్రస్తుతం లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి శృతిహాసన్‌ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే జైలర్‌ 2 (Jailer) చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు నెల్సన్‌ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలోనే జైలర్‌ 2 టీజర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్. హుకుం సాంగ్‌తో సాంగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజ‌ర్ గూస్ బంప్స్ తెప్పించింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో శరవేగంగా జ‌రుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర వార్తలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలు భాషలకు చెందిన అగ్ర నటులు భాగం కానున్నారు. ఇప్ప‌టికే మోహ‌న్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి అగ్ర నటులు ఇందులో అతిథి పాత్రలో నటించనున్నారని తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘జైల‌ర్ 2’ సినిమాలో నందమూరి నటసింహం బాల‌కృష్ణ కూడా కీలక పాత్రల్లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనున్నట్లు స‌మాచారం. అలాగే బాలయ్యతో పాటుగా ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య (Surya) కూడా ముఖ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాలో బాలకృష్ణ (Bala Krishna) పాజిటివ్ పాత్రలో అలరించనుండగా.. సూర్య‌ నెగెటివ్ పాత్ర పోషించనున్నట్లు సమాచారం. జైలర్ 2 సినిమాలో వీరిద్దరి మధ్య సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండనుందని సమాచారం. ఇది తెలిసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ ఏప్రిల్ రెండో వారంలో గోవాలో మొదలవనుందని సమాచారం. ఇందులో రజినీకాంత్ ముత్తువెల్ పాండియన్ గా పవర్ ఫుల్ అల్ట్రా స్టైలిష్ పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు. కాగా జైలర్‌ తొలి భాగంలో కీలక పాత్రలు పోషించిన రమ్యకృష్ణ, వినాయకన్‌, యోగిబాబులు ఇందులో కూడా నటించనున్నారు. సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్ పై కళానిధి మారన్ జైలర్ 2 ను భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత స్వరాలు అందించనున్నారు.