‘జాక్’కు భారీ షాక్.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

by | Apr 11, 2025 | సినిమా

టాలీవుడ్ లో గతేడాది టిల్లు స్క్వేర్‌తో అభిమానులను అలరించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించిన చిత్రం ‘జాక్‌’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ నిర్మించారు. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధూ సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించారు. ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు అందించారు. ఇందులో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ క్రమంలోనే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. అయితే మొదటి షోతోనే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రం ‘టిల్లు స్క్వేర్’కి మొదటి రోజు రూ.23 కోట్ల వరకు కలెక్షన్స్ రాగా.. ‘జాక్’ చిత్రానికి కనీసం రూ.2 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. మొత్తంగా ఈ సినిమాకు తొలి రోజు రూ.1.31 కోట్ల వసూళ్లు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ‘జాక్’ మొదటి రోజు కలెక్షన్స్ ను పరిశీలిస్తే..

★నైజాం 0.42 కోట్లు
★సీడెడ్ 0.13 కోట్లు
★ఉత్తరాంధ్ర 0.20 కోట్లు
★ఈస్ట్ 2.03 కోట్లు
★వెస్ట్ 0.07 కోట్లు
★గుంటూరు 0.10 కోట్లు
★కృష్ణా 0.10 కోట్లు
★నెల్లూరు 0.05 కోట్లు
★ఏపీ + తెలంగాణ 1.16 కోట్లు
★రెస్ట్ ఆఫ్ ఇండియా 0.04 కోట్లు
★ఓవర్సీస్ 0.11 కోట్లు
◆వరల్డ్ వైడ్ షేర్ (మొత్తం ) 1.31 కోట్లు

విడుదలకు ముందు ‘జాక్’ చిత్రానికి రూ.14.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15.5 కోట్ల షేర్ ను వసూలు చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు ఈ సినిమా రూ.1.31 కోట్ల షేర్ ను రాబట్టగా.. రూ.2.06 కోట్లు వసూలు చేసింది. ఇక జాక్ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.14.19 కోట్ల షేర్ ను వసూలు చేయాల్సి ఉంటుంది.