గతేడాది టిల్లు స్క్వేర్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాక్’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఓ డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేశారట. ఇందులో సిద్ధూ సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాగా, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘హు ఇజ్ పాబ్లో నెరుడా సాంగ్ ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా కిస్ అనే మెలోడి సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో హీరోయిన్ వైష్ణవితో ముద్దుకోసం సిద్ధు తన వెంట తిరుగుతుంటాడు. ఫుల్ లెంగ్త్ యుత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో కిస్ సాంగ్ స్పెషల్ గా నిలస్తుందని మేకర్స్ తెలిపారు. సనారే సాహిత్యం అందించిన ఈ పాటను జావేద్ అలీ, అమల చేబోలు ఆలపించారు. భాస్కర్ కంపోజ్ చేసిన ఈ కిస్ సాంగ్ కు సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. కాగా, భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

