అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్ : ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టు ఘన విజయం

by | Jan 31, 2025 | వార్తలు

అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో, ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో  ఘన విజయం సాధించింది

మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత బౌలర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం తో, కేవలం ఇద్దరు ప్లేయర్ లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.  ఓపెనర్ దవిన 45 పరుగులు, కెప్టెన్ నోర్గ్రోవ్ 30 పరుగులు చేశారు.  భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, సిసోడియా చెరో రెండు వికెట్లు తీశారు. ఆయుషి శుక్ల రెండ్ వికెట్లు తీశారు

అనంతరం 114 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్ లు కమలిని, గొంగడి త్రిష మొదటి వికెట్ కు 60 పరుగులు జోడించారు. 35 పరుగులు చేసిన గొంగడి త్రిష, బ్రెట్ బౌలింగ్ లో అవుట్ అయ్యింది

మరో ఓపెనర్ కమలిని, మరో సారి అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. 50 బంతుల్లో 56 పరుగులు చేసి అజేయం గా నిలిచింది.  శనిక 11 పరుగులతో అజేయం గా నిలిచింది