305 పరుగుల విజయలక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్ చక్కటి శుభారంభాన్ని అందించారు. వీళ్లిద్దరు మొదటి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చాలా రోజుల తరవాత హిట్ మాన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సర్లు, 12 ఫోరులు ఉన్నాయి
గిల్ 60 పరుగులతో రాణించాడు. శ్రేయాస్ అయ్యర్ మరోసారి రాణించి 44 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ మరోసారి 41 (Not Out) పరుగులతో రాణించి, తాను నిఖార్సైన అల్ రౌండర్ అని మరోసాయిర్ నిరూపించుకున్నాడు
ఇంగ్లాండ్ బౌలర్లలో, Overton రెండు వికెట్లు తీయగా, రషీద్, అట్కిన్సన్, లివింగ్ స్టోన్ తలా ఒక వికెట్ తీశారు.
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ కు మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఈ విజయం తో, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే, భారత్ 2-1 తో సిరీస్ కైవసం చేసుకుంది
అంతకు ముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్ ల లో 304 పరుగులు చేసింది
ఓపెనర్ లు ఫీల్ సాల్ట్, డకెట్ లు మొదటి వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాడ్ జట్టు ఓపెనర్లు సాల్ట్, డకెట్ లు వికెట్ కాపాడుకుంటూ, స్కోర్ బోర్డు ను పరిగెత్తిస్తోన్న తరుణంలో, మొదటి మ్యాచ్ ఆడుతోన్న వరుణ్ చక్రవర్తి, సాల్ట్ వికెట్ పడగొట్టి భారత్ కు బ్రేక్ త్రూ ఇచ్చాడు
సాల్ట్ 26 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుట్ అవగా, మరో ఓపెనర్ డకెట్ 65 పరుగులతో రాణించాడు. ప్రమాదంగా మారుతున్న తరుణం లో డకెట్ ను జడేజా అవుట్ చేశాడు.
సీనియర్ బ్యాట్స్ మాన్ జో రూట్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు ను నడిపించాడు. 69 పరుగులు చేసిన జో రూట్ ను కూడా జడేజా అవుట్ చేశాడు
తడబడుతూ ఆడిన బ్రూక్ 52 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ బట్లర్ 34 పరుగులు చేసి నౌట్ అయ్యాడు
భారత బౌలర్ ల లో జడేజా (10-1-35-3)పొదుపుగా బౌలింగ్ చేసి కీలకమైన 3 వికెట్లు తీశాడు. షమీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్య తలా ఒక వికెట్ తీశారు. ముగ్గురు బ్యాట్స్ మన్ లు రన్ అవుట్ అయ్యారు

